కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కుసుమ్–B (PM-KUSUM Component-B) పథకం కింద సోలార్ పంప్ సెట్లకు భారీగా 80% సబ్సిడీతో అందిస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేసుకుని నిరంతర నీటి సరఫరా పొందవచ్చు.
ఈ పథకం ఉద్దేశ్యం
- రైతులకు విద్యుత్ సమస్యను తగ్గించడం
- సాగునీటి కోసం డీజిల్/కరెంట్‌పై ఆధారాన్ని తగ్గించడం
- పర్యావరణహితమైన సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం
ఈ పథకం కింద అర్హులైన రైతులు మొత్తం వ్యయంలో కేవలం 20% మాత్రమే చెల్లిస్తే, మిగిలిన 80% మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.
సబ్సిడీ వివరాలు
- సోలార్ పంప్ సెట్ సామర్థ్యం (HP) ఆధారంగా సబ్సిడీ ఉంటుంది
- మొత్తం వ్యయంలో 80% వరకు ప్రభుత్వ సహాయం
- రైతు వాటా: కేవలం 20% మాత్రమే
అర్హులు ఎవరు?
- స్వంత వ్యవసాయ భూమి కలిగిన రైతులు
- పొలాల్లో సాగునీటి అవసరం ఉన్న రైతులు
- సోలార్ పంప్ సెట్ ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉన్న రైతులు
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- రైతు గుర్తింపు సంఖ్య (Farmer ID / F-ID)
- మొబైల్ నంబర్
- ఈమెయిల్ ఐడి
- బ్యాంక్ ఖాతా వివరాలు
దరఖాస్తు ఎలా చేయాలి?
ఆఫ్‌లైన్ విధానం:
- మీకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సేవా కేంద్రం (CSC / రైతు సేవా కేంద్రం) ను సందర్శించండి
- పథకం వివరాలు తెలిపి, అవసరమైన పత్రాలు ఇచ్చి దరఖాస్తు చేయవచ్చు
ఆన్లైన్ విధానం:
- ప్రభుత్వం సూచించిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- Register / Apply ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- మొబైల్ నంబర్ నమోదు చేసి లాగిన్ అవ్వండి
- వ్యక్తిగత వివరాలు సరిగా నింపండి
- అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి
- Submit బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి
LINK: Apply Now
ముఖ్య గమనిక
- దరఖాస్తు చేసుకునే ముందు అన్ని వివరాలు సరిగా ఉన్నాయో చూసుకోండి
- అర్హత ఉంటే మాత్రమే సబ్సిడీ మంజూరు అవుతుంది
- ఎంపిక ప్రక్రియ తర్వాత సోలార్ పంప్ సెట్ అమరిక జరుగుతుంది





