10వ తరగతి అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు | Telugu
ఫెడరల్ బ్యాంక్ భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటి. బ్యాంక్ తన నోటిఫై చేసిన బ్రాంచ్‌లు మరియు కార్యాలయాలలో Office Assistant పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
10వ తరగతి అర్హతతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
| వివరాలు | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 30 డిసెంబర్ 2025 |
| దరఖాస్తు ప్రారంభం | 30 డిసెంబర్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 08 జనవరి 2026 |
| అడ్మిట్ కార్డ్ విడుదల | 23 జనవరి 2026 లోపు |
| ఆన్‌లైన్ అప్టిట్యూడ్ టెస్ట్ | 01 ఫిబ్రవరి 2026 |
పోస్టు వివరాలు (Post Details)
| అంశం | వివరాలు |
|---|---|
| సంస్థ పేరు | Federal Bank |
| పోస్టు పేరు | Office Assistant |
| ఉద్యోగ రకం | ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగం |
| పని ప్రదేశం | నోటిఫై చేసిన బ్రాంచ్‌లు (రాష్ట్ర / జిల్లా వారీగా) |
అర్హతలు (Eligibility Criteria)
విద్యార్హత (01-12-2025 నాటికి)
- అభ్యర్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- Graduation పూర్తి చేసి ఉండకూడదు
వయస్సు పరిమితి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- జనన తేదీ: 01-12-2005 నుంచి 01-12-2007 మధ్య ఉండాలి
వయస్సు సడలింపు
- SC / ST అభ్యర్థులకు గరిష్టంగా 5 సంవత్సరాల సడలింపు
- ఫెడరల్ బ్యాంక్‌లో తాత్కాలికంగా పనిచేసిన వారికి కూడా వర్తిస్తుంది
ఇతర అర్హతలు
- అభ్యర్థి భారత పౌరుడు అయి ఉండాలి
- నోటిఫై చేసిన బ్రాంచ్ ఉన్న అదే జిల్లా లేదా 20 కి.మీ పరిధిలో నివాసం ఉండాలి
- Microsoft Office పై కనీసం 1 నెల శిక్షణ సర్టిఫికెట్ తప్పనిసరిMicrosoft Office (MS Word, Excel, PowerPoint మొదలైనవి) పై కనీసం ఒక నెల వ్యవధి గల శిక్షణ పూర్తి చేసి, దానికి సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు
జీతం & ఇతర లాభాలు (Salary & Benefits)
| అంశం | వివరాలు |
|---|---|
| ప్రారంభ బేసిక్ పే | ₹19,500 |
| పే స్కేలు | ₹19,500 – ₹37,815 + స్టాగ్నేషన్ ఇన్‌క్రిమెంట్స్ |
| ఇతర లాభాలు | NPS, గ్రాట్యుటీ, మెడికల్ ఇన్సూరెన్స్, బ్యాంక్ లోన్లు |
ఎంపిక విధానం (Selection Process)
- Centre Based Online Aptitude Test
- Personal Interview
ప్రతి దశలో అర్హత సాధించిన అభ్యర్థులనే తదుపరి దశకు పిలుస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష వివరాలు
| విభాగం | ప్రశ్నలు | మార్కులు |
|---|---|---|
| కంప్యూటర్ నాలెడ్జ్ | 15 | 15 |
| ఇంగ్లిష్ | 15 | 15 |
| లాజికల్ రీజనింగ్ | 15 | 15 |
| మ్యాథమెటిక్స్ | 15 | 15 |
| మొత్తం | 60 | 60 |
- పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు
- నెగటివ్ మార్కులు: లేవు
- పరీక్ష భాష: ఇంగ్లిష్
అప్లికేషన్ ఫీజు (Application Fee)
| కేటగిరీ | ఫీజు |
|---|---|
| General / Others | ₹500 |
| SC / ST | ₹100 |
GST & ఆన్‌లైన్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి.
ఉద్యోగ ప్రదేశాలు (Posting Locations)
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో నోటిఫై చేసిన బ్రాంచ్‌లు ఉన్నాయి.
అభ్యర్థి దరఖాస్తు సమయంలో తనకు అనుకూలమైన బ్రాంచ్‌ను ఎంచుకోవాలి.
తరచూ అడిగే ప్రశ్నలు
Q1: Graduation చేసిన వారు అప్లై చేయవచ్చా?
లేదు. Graduation పూర్తి చేసిన వారు అర్హులు కారు.
Q2: పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉందా?
లేదు.
Q3: ఈ ఉద్యోగం శాశ్వతమా?
మొదట 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ నిబంధనల ప్రకారం కొనసాగింపు ఉంటుంది.
Q4: అప్లికేషన్ ఆఫ్‌లైన్‌లో చేయవచ్చా?
కాదు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
Official Links
| Aplication Link | Click Here |
| Download Notification | Click Here |
| Official Website | Click Here |





